ఎత్తుల భయాన్ని జయించా: రష్మిక

  • ఎంతో కాలంగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించానన్న రష్మిక
  • మైసా సినిమాలో 80 అడుగుల ఎత్తు నుంచి దూకిన రష్మిక
  • ఇన్స్టాలో 90 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన రష్మిక-విజయ్ యాడ్

ప్రస్తుతం కొచ్చిలో ‘మైసా’ చిత్ర షూటింగ్‌లో ఉన్న రష్మిక, తనకు ఎంతో కాలంగా ఉన్న 'ఎత్తుల భయాన్ని' అధిగమించినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆమె డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలైనా లెక్కచేయకుండా షూటింగ్‌ను కొనసాగించడం ఆమె అంకితభావానికి నిదర్శనం. అడవులు, ట్రెక్కింగ్‌లు, వర్షాల మధ్య ఈ షూటింగ్ తనకు కొత్త శక్తిని ఇచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.


మరోవైపు, రష్మిక - విజయ్ దేవరకొండ జోడీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన ఒక వాణిజ్య ప్రకటన ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్లకు పైగా లైక్స్‌ సాధించి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైక్స్‌ పొందిన రెండో ప్రకటనగా రికార్డు సృష్టించింది. విశేషమేమిటంటే, ఈ జాబితాలో 11.5 మిలియన్ల లైక్స్‌తో మొదటి స్థానంలో ఉన్నది కూడా ఈ జోడీకి సంబంధించిన మరో ప్రకటన కావడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబాలి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.


Rashmika Mandanna
Rashmika
Maissa Movie
Vijay Deverakonda
Ranabali Movie
Height Phobia
Kochi
Ravindra Pulle
Social Media
Instagram

More Telugu News